నటీనటుల బాగు కోసం పనిచేస్తానన్న ప్రకాశ్ రాజ్

Admin 2021-06-24 18:57:12 entertainmen
‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. 27 మందితో జాబితాను విడుదల చేశారు. ఆ తర్వాత తానూ పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్, నటి హేమలూ బరిలోకి దిగుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. ఎన్నికలను రసవత్తరంగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ఆలోచనలతో ‘మా’ ప్రతిష్ఠను నిలబెడతానన్నారు. నటీనటుల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు.