- Home
- tollywood
మరో తమిళ సినిమాలో రష్మిక
'సుల్తాన్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కథానాయిక రష్మిక త్వరలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం వుంది. విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బీస్ట్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకున్నారు. మరో కథానాయిక పాత్ర కోసం రష్మికతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట.