పోయిక్కల్ కుతిరాయ్ - ప్రభుదేవా ఫస్టు లుక్!

Admin 2021-08-05 12:12:12 ENT
ప్రభుదేవా తమిళంలో ఒక విభిన్నమైన సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే .. 'పోయిక్కల్ కుతిరాయ్'. సంతోష్ జయకుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో ఒక ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ప్రయత్నంలో ఆయన ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. కెరియర్ పరంగా ప్రభుదేవాకి ఇది 54వ సినిమా. రైజా విల్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - సముద్రఖని కనిపించనున్నారు.