కియారా అద్వానిని పారితోషికం 5 కోట్లు?

Admin 2021-08-06 13:31:12 ENT
చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రూపొందనుంది. 'దిల్' రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్లో నిర్మితమవుతున్న 50వ సినిమా ఇది. ఈ సినిమాకి గాను ఆమెకి అందుతున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె డిమాండ్ చేసిన పారితోషికం 5 కోట్లు అని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఇంతకుముందు ఆమె చేసిన రెండు సినిమాలకి కూడా ఒక కోటి లోపే పారితోషికంగా తీసుకుందట. హిందీలో 'కబీర్ సింగ్' సినిమా తరువాత కియారా గ్రాఫ్ మారిపోయింది. ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు .. విజయాలు కూడా పెరిగిపోయాయి. అక్కడి స్టార్ హీరోయిన్స్ రేసులో ఆమె ఉంది. ప్రస్తుతం అక్కడ ఆమె ఒక సినిమాకి 4 కోట్లు తీసుకుంటోందట.