షూటింగు మొదలెట్టిన ప్రకాశ్ రాజ్

Admin 2021-08-18 20:39:12 ENT
ప్రకాశ్ రాజ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చిన్నపాటి సర్జరీని నిర్వహించారు. మళ్లీ సినిమా షూటింగులను ప్రారంభించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. మణిరత్నం సార్, కార్తీలతో కలిసి గ్వాలియర్ లో ల్యాండ్ అయ్యామని చెప్పారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం మధ్యప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ కోసం ఓర్చాకు వెళ్తున్నామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.