- Home
- tollywood
నాగశౌర్య జోడీగా కేతిక శర్మ
నాగశౌర్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరుడు కావలెను' రెడీ అవుతోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. 'లక్ష్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇది విలువిద్యకి సంబంధించిన కథ .. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. నాగశౌర్య జోడీగా కేతిక శర్మ నటించగా, ఒక కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు