తెలుగులో చేసింది రెండు సినిమాలు

Admin 2021-09-30 05:48:20 ENT
బాలీవుడ్ భామల్లో ఇప్పుడు బిజీగా ఉన్న కథానాయికలలో .. అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న కథానాయికలలో కియారా అద్వాని ఒకరుగా కనిపిస్తుంది. అందాల చందమామలా కనిపించే ఈ సుందరికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందువల్లనే ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి.
కియారా అద్వాని తెలుగులో ఇంతకుముందు 'భరత్ అనే నేను' .. ' వినయ విధేయ రామ' సినిమాలు చేసింది. అలాంటి ఈ బ్యూటీని ఇప్పుడు తన సినిమా కోసం వంశీ పైడిపల్లి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఆయన ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'మహర్షి' తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి భావించాడు కానీ కుదరలేదు. ఆ కథను విజయ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం కియారా భారీ పారితోషికం తీసుకుంటోందని అంటున్నారు. 'బీస్ట్' తరువాత విజయ్ చేయనున్న సినిమా ఇదేనట!