నటుడిగా 12 ఏళ్లు పూర్తి చేశాను : రానా

Admin 2022-02-24 12:08:18 entertainmen
పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ .. " నటుడిగా నా ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అయింది. కెరియర్ మొదట్లో నా వలన సినిమా చెడిపోకూడదని కొంతమంది దర్శకులు నాకు యాక్టింగ్ నేర్పించారు.

నటుడినయ్యాను .. హీరోను కావడానికి ఏం చేయాలనే కాన్సెప్ట్ మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నేను తిరుగుతున్న రోజుల్లో నాకు ఎదురుపడిన హీరోనే పవన్ కల్యాణ్. ఇంతవరకూ నేను తెలుగు .. హిందీ .. తమిళ సినిమాలు చేశాను. ఎంతోమంది స్టార్స్ తో కలిసి పనిచేశాను.