బాలీవుడ్లో బిజీగా జాన్వీ కపూర్

Admin 2022-02-24 12:09:31 entertainmen
బాలీవుడ్ లో శ్రీదేవి వారసురాలిగా ఆ స్థాయిని .. స్థానాన్ని అందుకోవడానికి జాన్వీ కపూర్ తనవంతు ప్రయత్నం చేస్తోంది. అలాగే మంచి కథ .. పాత్ర వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా తెలుగులో చేయడానికి ఆమె కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతోంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా అతని జోడీగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. కొరటాల - ఎన్టీఆర్ సినిమా విషయంలోను జాన్వీ కపూర్ పేరు వినిపించింది. అయితే నిర్మాతగా 'వలిమై' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బోనీ కపూర్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.