- Home
- tollywood
మహేశ్ తో తలపడే విలన్ గా విక్రమ్!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో విలన్స్ గా కోలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ... విజయ్ సేతుపతి .. సముద్రఖని .. అర్జున్ వంటి వారు ఇక్కడ పవర్ఫుల్ ప్రతినాయకులుగా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఆ జాబితాలో హీరో విక్రమ్ కూడా చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నారని అంటున్నారు.