'కుంభకర్ణ'గా సునీల్

Admin 2022-02-24 12:33:31 entertainmen
హీరోగా వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వచ్చిన సునీల్, ఆ తరువాత కమెడియన్ గానే కొనసాగాలని అనుకున్నాడు. అయితే ఆయన ఆశించిన స్థాయి పాత్రలు పడలేదు. దాంతో విలక్షణమైన పాత్రలపై దృష్టిపెడుతూ ఆ దిశగా అడుగులు వేశాడు. ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే వర్కౌట్ అయింది.

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు సునీల్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన 'కలర్ ఫొటో' ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాలు ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి 'కుంభకర్ణ' టైటిల్ ను ఖరారు చేసి తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పడుకుంటే పోతాడు' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్.