'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రమోషన్స్ లో రష్మిక

Admin 2022-03-01 11:08:50 entertainmen
రష్మిక తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రెడీ అవుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ .. 'పుష్ప' సినిమాతో పాటు నేను చేసిన సినిమా ఇది. 'పుష్ప' సినిమా చేస్తూనే ఈ సినిమాను పూర్తిచేశాను. 'పుష్ప' సినిమా షూటింగు అడవుల్లో జరుగుతూ ఉండేది. అక్కడి వాతావరణం వేరు .. ఆ పాత్ర కోసం పడిన కష్టం వేరు. ఆ లొకేషన్ నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్ కి రాగానే అక్కడ పడిన కష్టమంతా మరిచిపోయేదానిని. ఈ కథకి తగిన పాత్రలు .. ఎక్కువమంది లేడీ ఆర్టిస్టులు కావడం వలన అంతా సంతోషంగా .. సందడిగా ఉండేది.