అమెరికా సైన్యంలో న్యాయవాదిగా చేరిన తమిళ నటి అఖిల నారాయణన్

Admin 2022-03-02 10:28:24 entertainmen
భారత సంతతికి చెందిన తమిళ నటి అఖిల నారాయణన్ అమెరికా సాయుధ దళాల్లో చేరారు. న్యాయవాదిగా సేవలు అందించనున్నారు. అరుళ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమా ‘కదంపరి’తో అఖిల చిత్రసీమలోకి గతేడాది ఎంట్రీ ఇచ్చారు.

అమెరికా సాయుధ దళాల్లోకి చేరడానికి ముందు అఖిల కొన్ని నెలల పాటు అమెరికా సైన్యం ఆధ్వర్యంలో యుద్ధ శిక్షణ సైతం తీసుకున్నారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో ఆమె న్యాయవాదిగా చేరినట్టు సమాచారం. అమెరికా సైన్యానికి న్యాయ సలహా సేవలు అందించనున్నారు.