- Home
- tollywood
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
ఈ మధ్య కాలంలో నాయిక ప్రధానమైన కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో హారర్ థ్రిల్లర్లు .. సస్పెన్స్ థ్రిల్లర్లు ఎక్కువ. ఎక్కువ మంది లేడీ ఆర్టిస్టులతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు మాత్రం రాలేదు. చాలా కాలం తరువాత అలాంటి ఒక సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.
శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా, కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన థియేటర్లకు తీసుకుని వస్తున్నారు.