వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గని'

Admin 2022-04-06 02:29:46 ENT
తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో ముంబై భామలు వరుసగా పరిచయమవుతున్నారు. కియారా అద్వానీ .. అలియా భట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ నెల 8వ తేదీన విడుదలవుతున్న 'గని' సినిమాతో సయీ మంజ్రేకర్ పరిచయం కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె కూడా చాలా బిజీగా ఉంది.

తాజా ఇంటర్వ్యూలో సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ .. "వరుణ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. పవన్ కల్యాణ్ గారి 'వకీల్ సాబ్' చూశాను. అల్లు అర్జున్ 'పుష్ప' .. చరణ్ 'మగధీర' సినిమాలను కూడా నేను చూశాను. వాళ్ల నటన నాకు బాగా నచ్చుతుంది.