విజయ్ పక్కన ఓకే చెప్పిన రష్మిక

Admin 2022-04-06 02:30:41 ENT
భారత్ లో ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషకు చెందిన హీరోలు మరో భాషలో స్ట్రెయిట్ చిత్రాలు చేస్తుండడం, అలాగే దర్శకులు, నిర్మాతలు కూడా పరభాషా హీరోలతో సినిమాలు చేస్తుండడం ప్రస్తుత ట్రెండ్. తద్వారా పాన్ ఇండియా సినిమా ఒరవడి మరింత విస్తరిస్తోంది.

ఈ కోవలోనే... టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు తమిళ అగ్రహీరో విజయ్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో విజయ్ కి జోడీగా అందాలభామ రష్మిక మందన్న పేరు ఖరారైంది. ఈ బహుభాషా చిత్రం కోసం రష్మిక ఓకే చెప్పింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. విజయ్ కి ఇది 66వ సినిమా.