స‌న్నీ లియోన్ మ‌రో ఖ‌రీదైన కారు కొనుగోలు

Admin 2020-09-12 17:26:41 entertainmen
స‌న్నీ లియోన్ మ‌రో ఖ‌రీదైన కారును కొనుక్కుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె త‌న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇట‌లీ కంపెనీ మ‌స‌రాటీ త‌యారు చేసే కార్లంటే ఆమెకు చాలా ఇష్టం. ఎంత‌గా అంటే ఆ కంపెనీ కార్లు ఇప్ప‌టికే ఆమె వ‌ద్ద రెండు ఉన్నప్ప‌టికీ మ‌రొకటి కొనుక్కునేంత‌లా. ఇటీవ‌లే ఆమె 1.31 కోట్లు ఖ‌ర్చుచేసి తెలుపురంగు గిబ్లి కారును కొని దానితో ఫొటోలు దిగింది. అమెరికాలో ఉన్న త‌న ఇంటి వ‌ద్ద‌కు ఈ కొత్త గిబ్లీ కారు డెలివ‌రీ అయ్యిందని ఆమె తెలిపింది. కాగా, 3.0 లీట‌ర్ ట్విన్ ట‌ర్బో వీ6 ఇంజిన్ తో గంటకు వంద కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 5.5 సెక‌న్ల‌లో అందుకునేంత పిక‌ప్ ఈ కారుకి ఉంటుంది.