వివాదాస్పద నటి కథ తెరపైకి.. గాయకుడి కుమారుడితో గొడవ హాట్ టాపిక్

Admin 2026-03-11 12:02:50 ENT
తమిళ నటి సోనా హైడెన్ బయోపిక్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘స్మోక్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్‌కు సోనా స్వయంగా దర్శకత్వం వహించడం ప్రత్యేకంగా మారింది. ఆమె జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం.

అయితే, ఈ బయోపిక్‌లో ఒక దివంగత లెజెండరీ గాయకుడి కుమారుడు మరియు ప్రముఖ గాయకుడితో అప్పట్లో జరిగిన వివాదం కూడా హైలైట్‌గా చూపిస్తారా? అనే ప్రశ్న టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అప్పట్లో కోలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించిన ఆ గొడవను సోనా ఈ చిత్రంలో ఎలా చూపిస్తారు? నిజ సంఘటనలను ఎంతవరకు తెరపైకి తీసుకువస్తారు? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరుగుతోంది.

2011లో ఒక సినిమా సక్సెస్ పార్టీ సందర్భంగా జరిగిన ఈ ఘటన అప్పట్లో మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ప్రముఖ గాయకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తనను వేధించారని తమిళ నటి సోనా హైడెన్ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది.

ఆ సమయంలో ఈ విషయం కోలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారి, పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనపై మీడియా, అభిమానుల్లో విస్తృతంగా చర్చ జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం గురించి తరచూ ప్రస్తావనలు వినిపిస్తూ వచ్చాయి.