చరణ్ హీరోగా శంకర్ పాన్ ఇండియా మూవీలో రెండో నాయికగానే అంజలి?

Admin 2022-04-06 02:32:42 ENT
చరణ్ ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' విజయంతో హ్యాపీగా ఉన్నాడు. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన 'బీస్ట్' .. 14వ తేదీన 'కేజీఎఫ్ 2' విడుదలవుతున్నాయి. ఆ తరువాత నుంచి 'ఆచార్య' ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

ఇక ఆ తరువాత నుంచి శంకర్ సినిమాపై చరణ్ దృష్టి పెట్టనున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం చిత్రీకరణ జరుపుకుంది. రాజమండ్రి షెడ్యూల్ సమయంలో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచే మళ్లీ షూటింగు మొదలవుతుందట. ఆ తరువాత దుబాయ్ .. హైదరాబాద్ షెడ్యూల్స్ ఉంటాయని చెబుతున్నారు.