- Home
- tollywood
కాషాయం దుస్తుల్లో అదిరిపోయే లుక్ : NTR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా జీవితంలో
మొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్నారు. తారక్ అభిమానులు పలువిధాలుగా స్పందిస్తున్నారు. కాగా ఓ అభిమాని స్పందిస్తూ.. ఇది టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న హనుమాన్ దీక్ష. బాలీవుడ్‌లో ఇలాంటి సాంస్కృతిని మనం ఎప్పుడైనా చూశామా? యావత్ భారతదేశం టాలీవుడ్ సినిమాల కోసం ఎదురుచూడడంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. మరో అభిమాని, మనవాడు జూనియర్ ఎన్టీఆర్ తన సంస్కృతిని అనుసరించడంగర్వించదగినది. తద్వారా తాతా సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. తెలుగు స్టార్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.