'భారత్​కు ప్రపంచకప్​ అందించడమే నా లక్ష్యం'

Admin 2022-04-17 03:48:52 ENT
భారత్​కు టీ20 ప్రపంచకప్‌ అందించడమే తన పెద్ద లక్ష్యమని వెటరన్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్​లో బెంగళూరు తరఫున అదిరిపోయే ప్రదర్శన చేస్తోన్న దినేశ్​.. శనివారం రాత్రి దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కార్తీక్‌ మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ప్రస్తుత, దీర్ఘకాల లక్ష్యాలను వెల్లడించాడు.