ఓవర్సీస్ లో కూడా RRR జాతర మాములుగా లేదు

Admin 2022-04-18 10:27:17 ENT
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతుంది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ధియేటర్ల వద్ద రష్ మాత్రం తగ్గట్లేదు. ప్రపంచవ్యాప్త కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఆర్ ఆర్ ఆర్ ఈ రికార్డు సాధించిన సినిమాలలో మూడో సినిమాగా నిలిచింది. ఈ రికార్డులో బాహుబలి 2 అగ్రస్థానంలో ఉంటె ఆ తర్వాత దంగల్ రెండవస్థానంలో ఉంది.
ఇటీవల, ఆర్ ఆర్ ఆర్ సినిమా నైజాంలో రూ. 100 కోట్లు సాధించిన తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది.

ఇప్పుడు తాజాగా మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదేంటంటే... ఆర్ ఆర్ ఆర్ సినిమా సీడెడ్ ఏరియాలో రూ. 50 కోట్లను సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో ఆర్ ఆర్ ఆర్ లోకల్ గా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్న విషయం తెలుస్తుంది.

ఇక ఓవర్సీస్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ జాతర మాములుగా లేదు. ఇప్పటికి 14మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టి, ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో రెండవ స్థానంలో నిలిచింది. కాగా, ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా బాహుబలి 2 అగ్రస్థానంలో ఉంది.