సౌత్ స్టార్స్ ను ప్రశంసించటానికి బాలీవుడ్ క్వీన్

Admin 2022-04-18 10:27:05 ENT
సౌత్ సినిమాలపై తన రివ్యూ నివ్వటానికి, సౌత్ స్టార్స్ ను ప్రశంసించటానికి బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాను, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిని, స్టార్ హీరోలు చరణ్, తారక్ ను సోషల్ మీడియా వేదికగా కంగనా ఆకాశానికెత్తేసిన విషయం తెలిసిందే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని ఇదివరకే కంగనా వ్యాఖ్యానించింది.
తాజాగా కంగనా మరోసారి సౌత్ హీరోలను పొగుడుతూ తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీని షేర్ చేసింది. ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ చిత్రాన్ని ఓ రేంజులో పొగిడేస్తూ, ఆ సినిమాలో నటించిన రాకింగ్ స్టార్ యష్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ పేర్కొంది. డెబ్భైలలో అమితాబ్ బచ్చన్ తన మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను ఉర్రుతలుంగించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ బాలీవుడ్లో అలాంటి హీరో గానీ, సినిమా కానీ రాలేదని, అమితాబ్ బచ్చన్ తరవాత ఆ స్పేస్ ను యష్ భర్తీ చేసారంటూ తన స్టోరీలో పేర్కొంది కంగనా. అలానే సౌత్ సూపర్ స్టార్స్ ఐన రామ్ చరణ్, తారక్, యష్, అల్లు అర్జున్ ల ఫోటోలను షేర్ చేస్తూ "దక్షిణాది తారలంతా వారి వారి సంప్రదాయాలకు చాలా విలువనిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ, నిరంతరం కష్టపడే మనస్తత్వం మాత్రమే కాదు వారి నమ్మకాలు కూడా ఆడియన్స్ చేత జేజేలు కొట్టిస్తుంది" అంటూ రాసుకొచ్చింది.