- Home
- tollywood
తన తొలి సంపాదన వెల్లడించిన సామ్...!
సమంత చూసిన ఫస్ట్ మూవీ 'జురాసిక్ పార్క్' అని సమంత తెలిపింది. ఓ హోటల్ లో తాను హోస్టెస్ గా పని చేశానని... ఎనిమిది గంటలు పని చేసి రూ. 500 అందుకున్నానని... అదే తన తొలి సంపాదన అని చెప్పింది. తాను టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని...
కానీ ఆ తర్వాత వేయించుకున్నానని తెలిపింది. టాటూల ఎవరూ వేయించుకోవద్దని, ఆ ఆలోచన కూడా మానుకోవాలని సూచించింది.
సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. అందరూ స్వశక్తిపై నమ్మకం పెట్టుకోవాలని, కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పింది.