నాకు వరుడు దొరికేశాడు: నికీషా పటేల్

Admin 2022-04-19 10:57:54 ENT
తాజాగా నికీషా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో ఛాట్ చేసింది. వారు అడిగిన‌ ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. త‌న పెళ్లి గురించి కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం ఇస్తూ... త‌నకు వరుడు దొరికేశాడని, త‌న‌కు కాబోయే వాడు యూకేలో ఉంటున్నాడని నికీషా తెలిపింది. తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వివ‌రించింది.