- Home
- tollywood
శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కోసం మహేష్
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవలే తెలిపింది చిత్రయూనిట్.
హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కు హీరో హీరోయిన్లు మహేష్ బాబు, కీర్తీ సురేష్ స్టెప్పులేస్తున్నారు. ఇక ఈపాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.