బ్యూటీ రకుల్ ప్రీత్ స్టైలే వేరు.

Admin 2022-04-19 11:59:46 ENT
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన అందచందాలతో లేటెస్ట్ ఫొటోషూట్లు నిర్వహిస్తూ.. సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు ట్రెండీ వేర్ లో రోజుకో తీరుగా అందాల విందు చేస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ పోస్ట్ చేసిన గ్లామర్ పిక్స్ కుర్రాళ్లను ఆకట్టకుంటోంది. తన గ్లామర్ కు ట్రెండీ అవుట్ ఫిట్ ను జతచేసి నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ. ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘మీ కలలను మీ రెక్కలుగా ఉండనివ్వండి’ అంటూ ఫొటోలను పంచుకుంది.

ఈ ఫొటోల్లో రకుల్ చారలు ఉన్న ట్రెండీ షూట్ లో ఆకర్షిస్తోంది. సముద్రపు ఒడ్డున మతిపోయే ఫోజులిచ్చింది. అదిరిపోయే సూట్ లోనూ అందాల విందు చేసింది. లోదుస్తులు కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిందీ ఢిల్లీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు రకుల్ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు.