రామ్ మూవీ వస్తున్న 'బుల్లెట్' సాంగ్!

Admin 2022-04-19 03:54:25 ENT
మాస్ కంటెంట్ ఉన్న కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. అలా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న కథనే ఎంచుకుని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'బుల్లెట్' సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, నదియా .. భారతీరాజా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.