- Home
- tollywood
తాను సినిమాల్లోకి రావడం పేరెంట్స్ కి ఇష్టం లేదని వ్యాఖ్య
మాది చాలా మధ్యతరగతి ఫ్యామిలీ .. మా ఫాదర్ బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. సినిమాలు అందరికీ కలిసిరావనేది ఆయన నమ్మకం. అయితే ఆయన నా ఇష్టాన్ని కాదనలేదు. కొంతకాలం ట్రై చేసి .. మనకి సెట్ కావు అనుకుంటే వెనక్కి వచ్చేయమని చెప్పారు.
అలా ఆయన నా దారిలో నన్ను వెళ్లనిస్తూ ఖర్చుల కోసం 300 రూపాయలు నా జేబులో పెట్టారు. ఆ డబ్బులు అయిపోయిన తరువాత నేను సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాను. అక్కడ సంపాదించుకున్న పేరే నన్ను సిల్వర్ స్క్రీన్ కి తీసుకొచ్చింది.