యూఎస్ లో ఆచార్య జోరు...

Admin 2022-04-19 04:16:17 ENT
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29 న విడుదల కావటానికి రెడీ అవుతుంది.

పక్కా కమర్షియల్ మూవీ గా కొరటాల ఈ మూవీ ని రూపొందించారు. తాజాగా విడుదలైన భలే భలే బంజారా పాటలో తండ్రీకొడుకుల గ్రేస్ మూవ్మెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అమెరికాలో ఆచార్య సినిమా హడావిడి అప్పుడే మొదలైపోయింది. డల్లాస్ లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించగా అక్కడి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

టికెట్ ధర 21 డాలర్లుగా నిర్ణయించగా మొదటి రోజునే 500 టికెట్లు అమ్ముడయ్యి, అమెరికాలో ఆచార్య మూవీ ప్రీమియర్ ను ఏప్రిల్ 28 మధ్యాహ్నం 3గంటలకు ప్రదర్శించనున్నారు.
అయితే ఈ మూవీలో చిరు కు జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.