పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌!

Admin 2022-04-19 08:48:44 ENT
కాజల్ అగర్వాల్ తల్లి అయ్యారు. ఈ రోజు ఆమెకు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు తెలుగు ప్రేక్షకుల మిత్రవింద, చందమామ జన్మనిచ్చారని సమాచారం. అయితే... కాజల్ కుటుంబ సభ్యులు గానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఉదయం కాజల్ చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిషా అగర్వాల్ అక్క డెలివరీ గురించి హింట్ ఇచ్చారు.

"స్పెషల్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నిషా అగర్వాల్ పోస్ట్ చేశారు. అయితే... అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.