- Home
- health
నిద్ర చాలా ముఖ్యం...శరీరంలో రోగనిరోధక శక్తి కోసం...
మన శరీరానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు.అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనం, ఉద్యోగాలు, ఇతర పనుల వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ అర్ధరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, ఫలితంగా తరచుగా జలుబు, ఇతర శారీరక సమస్యలతో బాధపడతారట. ఇక తక్కువగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందట.
6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మానసిక స్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నిద్ర లేమికి, డిప్రెషన్ కు చాలా సంబంధం ఉంది. డిప్రెషన్ ఉంటే నిద్ర రాదు, నిద్ర పట్టకపోతే డిప్రెషన్ వస్తుంది. కాబట్టి రోజులో కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
6-7 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఎక్కువగా ఆందోళన పడుతుంటారు. చాలా విషయాలను మర్చిపోతుంటారు. కాబట్టి నిద్రలేమి సమస్యలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కావాలంటే ఇంట్లోనే యోగా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు.