- Home
- tollywood
'బీస్ట్' 6 రోజుల వసూళ్లు ....!
'బీస్ట్' ఈ నెల 13వ తేదీన విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించింది.
తమిళనాడులోనే 51.05 కోట్ల షేర్ ను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో 6.98 కోట్ల షేర్ ను ..
కర్ణాటకలో 6.14 కోట్ల షేర్ ను ..
కేరళలో 4.63 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఓవర్సీస్ లో మాత్రం 26.65 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 97 కోట్ల షేర్ సాధించింది. 32 కోట్ల షేర్ ను రాబట్టవలసి ఉంటుందనేది కోలీవుడ్ టాక్. మరి ఆ మొత్తాన్ని రాబడుతుందా? అనేదే సందేహం. 'బీస్ట్' కథాకథనాల్లోని లోపం .. ఈ సినిమా వసూళ్లపై ' కేజీఎఫ్ 2' ప్రభావం చూపడం ఇందుకు కారణమని చెబుతున్నారు. 'రాధే శ్యామ్' తరువాత వచ్చిన 'బీస్ట్' కూడా పూజ హెగ్డేను నిరాశపరిచి, అసంతృప్తికి గురిచేసింది.