సుధీర్ బాబుకు కూడా హిట్ ఇస్తే ఇండస్ట్రీలో కృతి పేరు మారు మోగిపోవటం ఖాయం...

Admin 2022-04-20 01:22:54 ENT
తొలి సినిమా ఉప్పెన తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతిశెట్టి. తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బ్లాక్బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె, నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగ రాయ్, నాగ చైతన్య సరసన బంగార్రాజు చిత్రాలలోనూ నటించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి, ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారింది.

కృతిశెట్టి కు వరసపెట్టి పెద్ద సినిమాలలో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. తెలుగులో కృతి నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'లో, రామ్ పోతినేని 'ది వారియర్' లో, సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాలలో నటిస్తుంది.

కోలీవుడ్ హీరో సూర్య- బాల లో కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీలో కూడా కృతినే లీడ్ హీరోయిన్. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనందుకుంటే కృతి కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుంది.