కొత్త లుక్ తో అనసూయ...!

Admin 2022-04-21 10:45:41 ENT
అనసూయ వెండితెరకి వచ్చిన కొత్తలో స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే మెరిసేది. ఆమె ముఖ్యమైన పాత్రల వైపు అడుగులు వేస్తూ వెళ్లింది. గ్లామరస్ పాత్రలతో పాటు .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ కుదురుకుంటోంది.

లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేసింది. ఆర్వీ రెడ్డి .. మారం రెడ్డి శేషు ఈ సినిమాను నిర్మించారు. 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైందని దర్శకుడు చెప్పారు. అనసూయ కొత్త లుక్ తో కనిపిస్తుందనీ, త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తామని అన్నారు. ఈ సినిమాకి 'అరి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయికుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.