బాలీవుడ్ లో 250 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న 'కేజీఎఫ్ 2'

Admin 2022-04-21 10:49:02 ENT
హిందీ వెర్షన్ లో ఈ సినిమా ఈ రోజుతో 250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే 300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కథలో బలమైన యాక్షన్ తో పాటు ఎమోషన్ కలవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

భారీ తారాగణం ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించడానికి కారణమని అంటున్నారు. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో, శ్రీనిధి శెట్టి .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.