- Home
- tollywood
'సర్కారువారి పాట'... టైటిల్ సాంగ్ రెడీ!
సర్కారువారి పాట సినిమా నుండి ఇంతవరకూ బయటికి వచ్చిన 'కళావతి' .. 'పెన్నీ' పాటలు రికార్డుస్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను వదలడానికి టీమ్ రెడీ అయింది. ఈ నెల 23వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
ఈ పాట ఒక రేంజ్ లో అదిరిపోతుందని తమన్ ముందుగానే మహేశ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని కీలకమైన పాత్రను పోషించాడు. మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.