క్షమించమంటూ వేడుకోలు ... బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

Admin 2022-04-21 11:05:48 ENT
ఓ పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విమర్శలకు తలవంచాడు. పొగాకు ఉత్పత్తులకు ఇకపై ప్రచారకర్తగా ఉండబోనని ప్రకటించాడు. అంతేకాదు, ప్రజల ప్రాణాలను హరించే ఉత్పత్తులకు ప్రచారం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు.

ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ ఉండగా, తాజాగా అక్షయ్ కూడా చేరాడు. అయితే, అతడి నిర్ణయాన్ని అభిమానులు హర్షించలేదు.

"నన్ను క్షమించండి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పందన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను’’