- Home
- tollywood
విష్వక్సేన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్
విష్వక్సేన్ మాస్ కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా చేశాడు. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు.
జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. మరో కథానాయికగా రితిక నాయక్ ఆకట్టుకోనుంది. ఈ సినిమా నుంచి నిన్న వదిలిన ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. లవ్ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ ట్రైలర్, చాలా వేగంగా 1 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుంది.