మాస్ ను ఊపేసే సాంగ్ ..

Admin 2022-04-22 12:31:44 ENT
'ఎఫ్ 3' కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'ఊ ఆ అహ అహ' అనే పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో .. సాగర్ .. అభిషేక్ ఆపించారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది.

ఈ పాటలో తమన్నా .. మెహ్రీన్ తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. అంజలి .. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుంది.