- Home
- tollywood
తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల షేర్ : 'కేజీఎఫ్ 2' రికార్డు!
ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ 300 కోట్ల వసూళ్లకు చేరువవుతూ ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7 రోజుల్లో 700 కోట్లను రాబట్టడం విశేషంగా మారిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాని కొస్తే, ఇంతవరకూ 61 కోట్ల షేర్ ను సాధించింది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రభావితం చేసింది లేదు. రజనీ 'పెద్దన్న' .. సూర్య 'ఈటి' .. అజిత్ 'వలిమై' .. విజయ్ 'బీస్ట్' ఇటీవలే ఇక్కడి థియేటర్లకు వచ్చాయి. ఈ హీరోలందరికీ కూడా తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. అయినా వాళ్లందరి సినిమాలకి మించి యశ్ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం.