ప్రభాస్ సలార్ పై భారీ అంచనాలు...!

Admin 2022-04-22 03:08:45 ENT
కేజీఎఫ్ 2 గ్రాండ్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం సలార్ పై ప్రెజర్ పడుతుందని విమర్శకులు భావిస్తున్నారు.ఇందులో ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

సలార్ షూటింగును ప్రశాంత్ నీల్ 30శాతం మేర పూర్తి చేశారు. ఈలోపు ప్రభాస్ రాధేశ్యామ్ తో, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాల విడుదలతో బిజీగా ఉండటంతో సలార్ షూటింగుకు బ్రేక్ పడింది.

కేజీఎఫ్ 2 సంచలన విజయం సలార్ పై తప్పక ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. కేజిఎఫ్ గ్రాండ్ సక్సెస్ కు ప్రధానం కారణం హీరో ఎలివేషన్స్. దీంతో సలార్ లో మరింత హీరోయిజం ను, ఎలివేషన్స్ ను ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం అంత సులభమేమి కాదు.

సలార్ పై ఉన్న భారీ అంచనాలను ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల ద్వయం ఏమేరకు అందుకుంటారో చూద్దాం.