- Home
- tollywood
'కేజీఎఫ్-2'లో యశ్ నటన అద్భుతమన్న అల్లు అర్జున్
'కేజీఎఫ్-2' పై టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'కేజీఎఫ్-2 సినిమా యూనిట్‌కు అభినందనలు. ఈ సినిమాలో యశ్ నటన అద్భుతం. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి పాత్రలు అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ అభినందనలు. దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు సినిమాను రూపొందించిన తీరు చాలా బాగుంది. గొప్ప సినిమాను చూసిన అనుభవాన్ని అందించినందుకు, భారతీయ సినిమాను శిఖర స్థాయిలో నిలిపినందుకు ఈ సినిమా యూనిట్‌కు కృతజ్ఞతలు' అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.