మహిళలు యువకులతో డేటింగ్ చెయ్యకూడదా? మలైకా షాకింగ్ కామెంట్స్.

Admin 2022-04-22 03:39:47 ENT
వయసులో మలైకా కన్నా అర్జున్ పన్నెండేళ్ళు చిన్నవాడు. దీంతో వీరిద్దరి రిలేషన్ పై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా ఈ విమర్శలపై స్పందించింది. ఏ స్త్రీ జీవితమైనా విడాకులు అనే ఘట్టంతో ఆగిపోకూడదు. బ్రేకప్ లేదా విడాకుల తర్వాత స్త్రీలు జీవితం గడపటం చాలా ముఖ్యం. అంతేకాని విడాకుల తర్వాత ఒక స్త్రీ మరొకరితో రిలేషన్ లో ఉంటే ఎందుకు అందరూ తప్పుగా చూస్తున్నారు? మహిళలు యువకులతో డేటింగ్ చెయ్యకూడదా? నా తల్లి నాకు చిన్నప్పటినుండి ఏం నేర్పించిందో వాటికే నేను కట్టుబడి ఉంటా. నా తల్లి నన్ను ఎప్పుడూ నాకు నచ్చినట్టుగా ఉండమని, ఎవరి మీదా ఆధారపడొద్దని చెప్పింది. బలంగా, సంతోషంగా ఉండటానికి నిత్యం కృషి చేస్తూనే ఉంటాను.... అని మలైకా పేర్కొన్నారు.