- Home
- tollywood
బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో మాస్ రాజా
మాస్ రాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర ... ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ధమాకా, టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర చిత్రాలు ఏకకాలంలో షూటింగులు జరుపుకుంటున్నాయి. టైగర్ నాగేశ్వర రావు మూవీ నైట్ షూటింగ్ లో నిద్ర లేకుండా గడిపిన రవితేజ ఆ షెడ్యూల్ ఇలా.. కంప్లీట్ అయ్యిందో లేదో ధమాకా మూవీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసేసాడు. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఇందులో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్. తాజాగా ప్రారంభమైన షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకోనుందట. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం.