'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ రిలీజ్!

Admin 2022-04-22 09:19:20 ENT
'ఆచార్య' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుండి. మణిశర్మ స్వరపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 'ఆచార్య'తో ఈ సినిమాకేంటి సంబంధం అంటే, ఇది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన సినిమా కావడమే!