- Home
- tollywood
'బొమ్మ బ్లాక్‌బస్టర్' నుంచి ఇటీవలే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అందాల ఆరబోత, శృంగార సన్నివేశాల్లో నటించడం లోనూ వెనక్కి తగ్గకపోయినా ఆమెకు సిల్వర్ స్క్రీన్ అనేది నిరాశ గానే మిగిలిపోయింది. ఆమె నటించిన సినిమాల్లో ఒక్క 'గుంటూరు టాకీస్' మినహా మరే సినిమా అంతగా రిజల్ట్ రాబట్టలేదు. దీంతో కొంతకాలం సిల్వర్ స్క్రీన్ జర్నీని పక్కనబెట్టి ఎక్కువగా బుల్లితెర ప్రోగ్రామ్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ అలరిస్తోంది రష్మీ గౌతమ్. ప్రతి పండగ రోజున రష్మీ ప్రోగ్రాం లేనిదే ఆ రోజు గడవదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ యంగ్ లేడీ బ్యాచిలర్ పెళ్లిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక రష్మీ- సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళిద్దరి జోడీకి బుల్లితెరపై యమ క్రేజ్. తమ లవ్ ట్రాక్‌పై వస్తున్న రూమర్స్‌ని ఎన్నిసార్లు ఖండించినా వాటికి మాత్రం బ్రేకులు పడే అవకాశమే కనిపించడం లేదు.
రష్మీ వయస్సు.. దీనిపై కూడా ఎప్పటినుంచో ఓ కన్నేసి పెట్టారు ఆడియన్స్. గూగుల్‌లో చూపిస్తున్నా రష్మీ వయస్సు ఆమె నోటి ద్వారానే తెలుసుకోవాలని ఎన్నోసార్లు ట్రై చేశారు. అయితే తన ఏజ్ విషయంలో ఎప్పటినుంచో సీక్రెట్ మెయిన్‌టైన్ చేస్తున్న రష్మీ.. తాజాగా అందరి ముందే ఓపెన్ అయింది. తాజాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో రాకేష్ స్కిట్‌లో భాగంగా ఆ టీమ్ మెంబర్ రోహిణి యాంకర్ రష్మీ వయస్సు చెప్పించింది. అంటూ ప్రస్తుతం తన ఏజ్ 32 అని చెప్పకనే చెప్పేసింది రష్మీ గౌతమ్. దీంతో రష్మీ వయస్సుపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఇదే హాట్ ఇష్యూ కావడం విశేషం. ఇకపోతే రష్మీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బొమ్మ బ్లాక్‌బస్టర్' నుంచి ఇటీవలే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.