డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ యువకుడిని మాయ చేసిన యువతి

Admin 2020-09-14 16:34:11 entertainmen
హైదరాబాద్, పద్మారావు నగర్ కు చెందిన తరుణ్ అనే యువకుడికి ఓ డేటింగ్ యాప్ లో యువతి నుంచి సందేహం వచ్చింది. ఆపై ఇద్దరి మధ్యా చాటింగ్, వీడియో కాల్స్ జోరుగానే సాగాయి. యువకుడి వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను ఆ అమ్మాయి సేకరించి పెట్టుకుంది. ఆపై బెదిరింపులకు దిగిన ఆమె, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, తన వద్ద ఉన్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరికలకు దిగింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనతో పలు దఫాలుగా రూ. 73 వేలను ఆమె చెప్పిన ఖాతాలో జమ చేశాడు.