సినిమాల్లోకి రాకముందు తాను స్టూడియో ఫ్లోర్స్‌ తుడిచేదాన్నని : రవీనా

Admin 2022-04-23 02:49:31 ENT
సినిమాల్లోకి రాకముందు తాను స్టూడియో ఫ్లోర్స్‌ తుడిచేదాన్నని తెలిపింది. ఆఖరికి ఎవరైనా వాంతులు చేసుకుంటే తాను వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్నని గుర్తు చేసుకుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగినా, సినిమాల్లోకి రావాలని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ప్రహ్లాద్‌ కక్కర్‌ దగ్గర తాను అసిస్టెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. స్టూడియోలో పని చేసేటప్పుడు ఎవరైనా మోడళ్లు రాకపోతే వారికి బదులు తనకు మేకప్ వేసి ఆయన ఫొటోలు తీసేవారన్నారు. ఆ సమయంలో తనను అందంగా ఉన్నావని, స్క్రీన్‌పై ఉండాల్సిన వ్యక్తివని అందరూ పొగిడే వారన్నారు. సినిమాల్లోకి వచ్చే ముందు యాక్టింగ్, డ్యాన్స్ వంటివి నేర్చుకోలేదన్నారు. ఇండస్ట్రీకి వచ్చాకే అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు.