- Home
- bollywood
బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ బ్యూటీ కియారా
బాలీవుడ్ లో బ్రేకప్ కావడం చాలా సాధారణ అంశంగా మారింది. ఎన్నో ప్రేమపక్షులు విడిపోయాయి. తాజాగా మరో ప్రేమ జంట విడిపోయింది.
కియారా అద్వాని బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో గత కొన్నేళ్లుగా ఆమె డేటింగ్ చేస్తోంది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఏమైందో కానీ వీరు బ్రేకప్ అయ్యారు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేయడం ప్రారంభించారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్న తరుణంలో ఇద్దరూ విడిపోయారనే వార్త అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం మానేశారని వారితో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి వెల్లడించాడు. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.